- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీకి రాని KCR రాజీనామా చేయాలి.. CPI నారాయణ ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇంత కీలకమైన సమావేశానికి కేసీఆర్ హాజరు కాకపోవడం చాలా దారుణమైన విషయం. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఉపయోగపడని వ్యక్తికి పదవి ఎందుకని ప్రవ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సమాధానం ఇవ్వకపోతే.. దోచుకోవడానికి కట్టారనే నిర్ధారణకు వస్తామని అన్నారు. ఇదిలా ఉంటే.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణహిత-చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయని అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పారని సీఎం గుర్తుచేశారు. 2015లో కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖను సభలో చదివి వినిపించారు.






