Supreme Court చీఫ్ జస్టిస్‌పై దాడి యత్నం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు ప్రతిక : సీపీఐ నారాయణ ఆరోపణలు

by Ramesh Naini |   (  Updated:2025-10-06 13:15:23  IST  )

సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఓ న్యాయవాది చెప్పు విసిరిన సంఘటనను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా ఖండిస్తోంది.

Supreme Court చీఫ్ జస్టిస్‌పై దాడి యత్నం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు ప్రతిక : సీపీఐ నారాయణ ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Supreme Court) సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ (Justice BR Gavai)పై ఓ న్యాయవాది చెప్పు విసిరిన సంఘటనను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు సోమవారం సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ (CPI Narayana) ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు చెందిన కుడిపక్ష శక్తులు పెంచిపోషిస్తున్న అసహన సంస్కృతికు ప్రతీక అని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను అవమానపరచడం, న్యాయవ్యవస్థను బెదిరించడం లక్ష్యంగా చేసిన పూర్వ ప్రణాళికతో కూడిన దాడి ప్రయత్నం ఇదని తెలిపారు. సీపీఐ అభిప్రాయం ప్రకారం, న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక స్వతంత్ర స్తంభం అని తెలిపారు.

న్యాయమూర్తులపై దాడి చేయడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య శక్తులందరూ న్యాయవ్యవస్థ గౌరవం, స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత వహించాలని పిలుపు నిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దీని వెనుక ఉన్న ఉద్దేశం, సంస్థాగత ప్రోత్సాహం వెలికితీయాలని డా. కె. నారాయణ డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్, కంటెంప్ట్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి, ద్వేషం, బెదిరింపుల రాజకీయాలను ఎదుర్కోవడానికి, సామ్యవాద, ప్రజాస్వామ్య శక్తులందరూ ఐక్యంగా ముందుకు రావాలి అని పిలుపు నిచ్చారు.

Next Story