బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరి పోసిందే మీడియా: సీపీఐ నారాయణ

by Ajay Maddhiboyina |

మహా న్యూస్ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని సీపీఐ నేత నారాయణ ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం అని అన్నారు. బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరి పోలీసిన మీడియాపై

బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరి పోసిందే మీడియా: సీపీఐ నారాయణ
X

దిశ‌, వెబ్ డెస్క్: మహా న్యూస్ పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని సీపీఐ నేత నారాయణ ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం అని అన్నారు. బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరి పోలీసిన మీడియాపై దాడి చేయడం నీచమైన చర్య అని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ తప్పును ఒప్పుకోవాలని లేదంటే దాడితో తమకు సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలో భాగం అవుతారని హెచ్చరించారు. లేదంటే బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఆ మీడియా గొంతు నొక్కడమే అని చెప్పారు.

మీడియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే మహాన్యూస్ ఛానల్ ఆఫీసుపై నేడు బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్‌పై వరుసగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనను పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలంగాణలోని నాయకులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం దీనిని ఖండించారు.

Next Story