- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI Narayana: మీ విజ్ఞతకే వదిలేస్తున్న.. చిరంజీవి వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్
చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సీపీఐ నారాయణ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) కౌంటర్ ఇచ్చారు. గతంలో చిరంజీవిపై (Chiranjeevi) తాను మాట్లాడిన మాటలను అప్పుడే క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నానని కానీ మళ్లీ ఆవీడియోలను వైరల్ చేస్తూ తనను బద్నాం చేయడం సరికాదని మండిపడ్డారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజం అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నారాయణ.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నిన్న ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని అయినా తనను కొంత మంది నేతలు విమర్శిస్తూనే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ నాయకుడు నన్ను అకారణంగా మాటలు అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ అడ్డుకుని ఎదురుతిరిగింది అని గతంలో నారాయణ చేసిన వ్యాఖ్యల అంశాన్ని చిరంజీవి ప్రస్తావించారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిచిన నారాయణ పై విధంగా స్పందించారు.
నలుగురి చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ:
తమకు వేతనాలు పెంచాలని తెలుగు సినీ ఇండస్ట్రీ కార్మికులు చేస్తున్న సమ్మెపై (Telangana cinema workers protest) నారాయణ స్పందించారు. సినిమా ఇండస్ట్రీ నలుగురి చేతుల్లో ఉందని వారే మొత్తం ఆడిస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, హీరోలను పిలిచి మాట్లాడే ముఖ్యమంత్రి సినిమా కార్మికులను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కార్మికులను విస్మరిస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వానికి పక్షపాతం సరికాదని కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నారు. గతంలో బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాళ్లను సంఘ విద్రోహశక్తులుగా చూసేవాళ్లం అని కానీ ఇప్పుడు ప్రభుత్వమే రేట్లు పెంచి బ్లాక్ టికెట్లు అమ్ముతోందని ఆరోపించారు.






