నదీ జలాలపై వేసిన కమిటీని నాన్చవద్దు: సీపీఐ నారాయణ

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-19 17:23:39  IST  )

సహజ జలవనరులైన కృష్ణ, గోదావరి నదీ జలాలలను కాపాడుకోవాలని వీటిలో మిగులు జలాలు 2 వేల టీఎంసీల పైనే ఉంటాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

నదీ జలాలపై వేసిన కమిటీని నాన్చవద్దు: సీపీఐ నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సహజ జలవనరులైన కృష్ణ, గోదావరి నదీ జలాలలను కాపాడుకోవాలని వీటిలో మిగులు జలాలు 2 వేల టీఎంసీల పైనే ఉంటాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే కమిటీని వేశారన్నారు. అయితే గడ్డపారం నానపెట్టినట్టు ఈ కమిటీ ని నానబెట్టొద్దని డిమాండ్​చేస్తున్నానన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు జల సమస్యపైనే ఎజెండాగా వచ్చి మాట్లాడారని, తమ పార్టీగా మేం కూడా అదే కోరుకుంటున్నామన్నారు. నదీ జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సాధనతో ఏదైనా సాధ్యం చేయగలమని అన్నారు. శనివారం ఢిల్లీలో ఈ మేరకు నారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రాజెక్టు కట్టాలో ఏ ప్రాజెక్టు కట్టకూడదో అనే అంశం ముందుకు వెళ్తే ఇది సాధ్యం కాదన్నారు. ముందుగా మిగులు జలాలపై ఒక అంచనా వేసుకోవాలని అప్పుడే ఒక స్పష్టతకూ రావచ్చునన్నారు. కాళేశ్వరం సమస్య అయినా, సాంకేతిక సమస్య అయినా కేంద్రం పరిష్కారం చేయాల్సిందేనన్నారు. 1950 సంవత్సరం నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి నీరు కావాలని కమ్యూనిస్టు పార్టీ కోరుతోందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు సెంటిమెంట్ వచ్చింది అప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, అదే సెంటిమెంట్ ఎల్లప్పుడూ ఉండవన్నారు.

బీఆర్​ఎస్​ పార్టీ నేతలనుద్దేశించి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ అయిపోయిందని, ఓ పదేళ్లు తెలంగాణ సెంటిమెంట్​తోనే నడిపించారన్నారు. కేసీఆర్​ఎప్పుడైతే టీఆర్​ఎస్​పార్టీ పేరును బీఆర్​ఎస్ గా మార్చాడో అప్పుడే సెంటిమెంట్ పోయిందన్నారు. తొలి సీఎం కేసీఆర్​క్యాబినెట్​లో పని చేసిన 12 మంది మంత్రులు ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే నన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేయడని, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల గురు శిష్యుల లెక్కనే అయిపోయిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పొట్టోడు.. గట్టోడు కూడా అని నారాయణ చమత్కరించారు. బీఆర్​ఎస్​వాళ్లు పదే పదే పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని, రాజకీయంగా పోరాటం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడొద్దని సూచించారు. పోలవరం సమస్య ఓ కొలిక్కి వస్తుందని, నీళ్ల అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళు తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసినట్లేనని మరచిపోరాదన్నారు. కొన్ని పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు వ్యవసాయం కోసం నీళ్లు అందించే విధంగా కృషి చేయాలని కోరుతున్నానన్నారు. నీటి ప్రాజెక్టుల పట్ల ప్రాజెక్టుల పట్ల సీపీఐ పార్టీ సానుకూలంగానే ఉంటుందని మరో సారి పేర్కొన్నారు. వైఎస్​రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం చేపట్టినప్పుడు తాము స్వాగతించామన్నారు. మతాము కాళేశ్వరం అవినీతిపైనా నిలదీశామన్నారు. బనకచర్ల విషయం వచ్చినప్పుడు చంద్రబాబుకు తాము సలహా ఇచ్చామని, రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న హంద్రీనీవా మరికొన్ని ప్రాజెక్టులను పూర్తిచేయాలని చెప్పామన్నారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు పేరు తెరపైకి రాగానే రాజకీయ లబ్ధి కోసం అందరూ మాట్లాడుతున్నారని నారాయణ అన్నారు.

Next Story