- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనెజులాపై అమెరికా దాడిని ఖండిస్తున్నాం: CPI నారాయణ
వెనుజులాపై అమెరికా దాడిని సీపీఐ నారాయణ ఖండించారు. అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకు ఎవరు అన్యాయం చేసినా వాళ్లు సహించరని అన్నారు. దేశ అధ్యక్షుడు తన భార్యతో కలిసి ఉంటే తీసుకువెళతారా అని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: వెనుజులాపై అమెరికా దాడిని సీపీఐ నారాయణ ఖండించారు. అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకు ఎవరు అన్యాయం చేసినా వాళ్లు సహించరని అన్నారు. దేశ అధ్యక్షుడు తన భార్యతో కలిసి ఉంటే తీసుకువెళతారా అని మండిపడ్డారు. వెనుజులా నుండి మనకు ఆయిల్ దిగుమతి అవుతుందని కాబట్టి భారతదేశానికి కూడా నష్టం కలుగుతుందన్నారు. ప్రధాని మెడీ వెనుజులా అధ్యక్షుడి అరెస్ట్ ను ఖండించాలన్నారు. దేశ అధ్యక్షుడిని మరో దేశం అరెస్ట్ చేయడానికి ఎలాంటి అధికారం లేదన్నారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని మండిపడ్డారు.
మరోవైపు మోడీ వచ్చిన తరవాతనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓ హీరోయిన్ ప్రస్తుత ఎంపీ 2014 నుండే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించిందన్నారు. కానీ బీజేపీ వాళ్లు ఖండించలేదన్నారు. చరిత్ర పుటల్లో గాంధీ పేరును తొలగించి మోడీ పేరు ఉండేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. GST రూపంలో రాష్ట్రాలను కేంద్రం దోపిడీ చేస్తోందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో పేదలకు అన్యాయం జరిగితే పోరాడతామని చెప్పారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.






