- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాలు రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాలు రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుందన్నారు. ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు అన్నింటినీ కేంద్రం ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టార్ విమానయాన సంస్థలను కేంద్రమే చంపేసిందన్నారు.
కాబట్టి ఈ సంక్షోభానికి కేంద్రమే కారణం అని చెప్పారు. ఇండిగోను ఆధీనంలోకి తీసుకుని తిరిగి కేంద్రమే నడిపించాలని అన్నారు. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రజలను, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని అన్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ వారి ధనాన్ని దోచేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే నాలుగు రోజులుగా ఇండిగో ప్రయాణికులకు చుక్కులు చూపిస్తోంది. ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు అంతా ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. విమానాలు రద్దు అవ్వడంతో కొంమంతి ప్రయాణికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






