- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ రెడ్డిని కలిసిన CPI ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం(Congress Govt) ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం(Congress Govt) ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. సీపీఐ నాయకులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్ వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజా సమస్యలపై వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో చర్చించారు. అలాగే, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను వివరించారు. కాగా, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త అందించిన విషయం తెలిసిందే. జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మినీ అంగన్వాడీలకు రూ. 7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ. 13,650 జీతం అందిస్తోంది. ట్వీట్






