అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కేంద్రం ఎదుట CPI MLA కూనంనేని కీలక డిమాండ్

by Gantepaka Srikanth |

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కేంద్రం ఎదుట CPI MLA కూనంనేని కీలక డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ప‌ట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ‌స‌భ్యుల‌కు సానుభూతిని తెలియజేశారు. విమానం ప‌డిన భ‌వ‌నంలో నివ‌సిస్తున్న మెడికల్ విద్యార్థులు సైతం చనిపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. చనిపోయిన ప్రయాణికులకు, విద్యార్థులకు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా దేశ పౌర విమానయాన శాఖ కట్టుదిట్టమైన నిర్వహణ చర్యలు తీసుకోవాల‌ని కోరారు.

Next Story