కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ సర్కార్: కూనంనేని

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు.

కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ సర్కార్: కూనంనేని
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం పెట్టి.. కృష్ణా జలాలపై దోపిడీపై మాట్లాడితే.. అదే టాపిక్‌ను అసెంబ్లీలో చర్చ చేయడం చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ట్రాప్‌లో పడినట్లు అనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. నీటి పంపకాల్లో విషయంలో కేసీఆర్​తెలంగాణకు తీరని ద్రోహం చేశారని, ఎప్పడు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారో తెలియని పరిస్థితి ఉండేది. ఏనాడూ ఇతర పార్టీ నేతలతో ప్రాజెక్టులపై చర్చించలేదని, సొంత నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసి కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం వందలాది బలి తీసుకుంటే రాష్ట్రం ఏర్పడిన ఆయన కుటుంబ మాత్రమే బాగుపడిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్​కుమార్​పవర్​పాయింట్​ప్రజేంటేషన్​ఇచ్చి కృష్ణ జలాల వాటా ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను వీలైనంత పూర్తి చేయాలని, చిన్న ప్రాజెక్టులు ఒకే దఫా, పెద్ద ప్రాజెక్టులు దశలవారీగా నిర్మించాలని సూచించారు. ప్రాజెక్టులు సమ్రగ నివేదికలు సిద్ధం చేసి బ్లూ ప్రింట్​తయారు చేయాలన్నారు.

Next Story