- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ తో పొత్తు ఉంటుంది కానీ.. : కూనంనేని సంచలన వ్యాఖ్యలు
by Muthe.Rajitha |
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambasiva Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)తో పొత్తుపై కీలక ప్రకటన చేసారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తో స్నేహ బంధం కొనసాగిస్తున్నామని అన్నారు. ఇకపై కూడా ఆ స్నేహ బంధాన్ని అలాగే కంటిన్యూ చేస్తామని తెలిపారు. కానీ ప్రజా ఉద్యమాలపై కూడా తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేసారు. ప్రజలకు కష్టం వస్తే ఎదురుగా ఎవ్వరు ఉన్నా తమకు అవసరం లేదని, అది ఢిల్లీ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. త్వరలో సీపీఐ వందేళ్ల కార్యక్రమాన్ని ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తామని కూనంనేని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు అంతా హాజరవుతారని, త్వరలోనే కార్యక్రమ వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Next Story






