- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI MLA: నేనే స్వాతంత్య్రం తెచ్చానని గాంధీ కూడా ఏనాడూ చెప్పుకోలే
సోనియా గాంధీ భిన్నాభిప్రాయాలతో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సోనియా గాంధీ భిన్నాభిప్రాయాలతో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాజకీయాలను బేషజాలను పక్కన పెట్టి, అందరూ ఒక తాటిపైన ఉంటేనే తెలంగాణ తల్లిపై గౌరవం ఉన్నట్టు అర్థమవుతుందని సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజకీయం చేస్తే చరిత్ర క్షమించబోదని స్పష్టం చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండడమే తల్లి రూపమని, తెలంగాణ తల్లి చేతిని చూస్తే ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్నదన్నారు. డిసెంబర్ 9న పర్వదినోత్సవంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆనాటి పోరాటం ఫలితంగా విజయం సాధించిన నాటి ‘సెప్టెంబర్ 17’ను ఎటువంటి బేషజాలు, బింకాలకు పోకుండా, మానసిక అడ్డంకులను వదిలి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అన్నీ బీఆర్ఎస్ నేతలు అనుకున్నట్లు ఉండబోవని అన్నారు. ప్రస్తుతం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించిందా? అని కూనంనేని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ కూడా తాను ఒక్కడినే భారతదేశానికి స్వాంతత్య్రం తీసుకొచ్చానని ఎప్పుడూ చెప్పకోలేదన్నారు. విరోచితంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, 4500 మరణించారని, మగ్ధుం మొయినూద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి కమ్యూనిస్టు యోదులు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందని వివరించారు. వారి త్యాగాలతోనే హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి చెందిందని, దీనిని ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీ వ్యక్తిగతంగా చెప్పుకోలేదన్నారు.






