- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య అపహరణ
సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య (52) అనే మహిళను హైదరాబాద్ లోని హఫీజ్‌పేట్ నుండి సాయుధ వ్యక్తులు అపహరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు మా సంస్థ కు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాలసమన్వయ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్‌లు గురువారం ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సీపీఐ(మావోయిస్టు) కార్యకర్త నార్ల శ్రీవిద్య (52) అనే మహిళను హైదరాబాద్ లోని హఫీజ్‌పేట్ నుండి సాయుధ వ్యక్తులు అపహరించినట్టు ఆమె కుటుంబ సభ్యులు మా సంస్థ కు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాలసమన్వయ కమిటీ సభ్యుడు జీవన్ కుమార్‌లు గురువారం ప్రకటన చేశారు. ఆమెను అపహారించి తీసుకెళ్లిన వాళ్ళు మప్టీ లో ఉన్న పోలీసులా లేక ప్రైవేట్ వ్యక్తులా తమకు తెలియదని, వారి కుటంబ సభ్యులు తెలుపుతున్నారని పేర్కోన్నారు. నార్ల శ్రీవిద్య మావోయిస్టు పార్టీ సభ్యురాలయినందు వల్ల ఆమెకు హాని జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారని తెలపారు.
ఆమెను తీసుకెళ్లిన వారు పోలీసులయితే చట్ట ప్రకారం ఆమెను కోర్టు లో ప్రవే శపెట్టాలని, పోలీసులు కాకుంటే ఆమెను వెతికి, ఆమెపై కేసులు ఏమైన ఉంటే ఆమె పట్ల చట్ట ప్రకారంగా వ్యవహరించాలని మానవ హక్కుల వేదిక తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. మావొయిస్ట్ అగ్రనేత తక్కలపెల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న సతీమణిగా తెలిపారు. ఆమె మాజీ మావోయిస్టు నేత రవి శర్మ సోదరి కావడం గమనార్హం..
- Tags
- cpi






