కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతిపై సీపీఐ నేతల సంతాపం

by Muthe.Rajitha |

కేరళ మాజీ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎంఎల్​సీ నెల్లికంటి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు.

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతిపై సీపీఐ నేతల సంతాపం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళ మాజీ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎంఎల్​సీ నెల్లికంటి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్యంలోనే చదువు మానేసి కార్మికుడిగా పని చేస్తూ కార్మిక ఉద్యమ నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. ట్రావెన్ కోర్ సంస్థానంలో భూముల పోరాటం చేసి జైలు కెళ్ళి రాజకీయ జీవితంలో అడుగుపెట్టారని వారు కేరళలో నిరుపేద కుటుంబంలో జన్మించి లెనిన్, స్టాలిన్ ల జీవితాలతో పాటు ప్రపంచంలోనే కీలక ఘట్టాలను చూసిన వ్యక్తి అచ్చుతానందన్​ అని వారు గుర్తు చేసుకున్నారు.

అచ్యుతానందన్ మృతి పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కమ్యూనిస్టు యోధుడు, ఈతరానికి ఆదర్శవంతులు కేరళ మాజీ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం, వారికుటుంబానికి సానుబూతిని తెలియజేస్తున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Next Story