- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
సింగరేణి కార్మికుల సమస్యలను యాజమన్యం జూన్ రెండోవారం లోపు పరిష్కరిచాలని, లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
మీడియా సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు
బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికుల సమస్యలను యాజమన్యం జూన్ రెండోవారం లోపు పరిష్కరిచాలని, లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎంఎల్‌ఎ, సింగరేణి కాలరీస్ వర్కర్క్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్రఅధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావుమాట్లాడుతూ తెలంగాణ గుండెకాయగా రాష్ట్రానికి సిరులను కురిపించే సింగరేణి సంస్థను ప్రభుత్వం అన్ని విధాలు పరిరక్షించాలనిడిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ది ఈ రెండు వీడదీయరానివని కానీ ప్రభుత్వం లాభాలు తప్ప కార్మికుల శ్రేయస్సును ఎంతమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా సింగరేణికి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండ గతంలో ఆర్‌టీసీని బలిపశువును చేసినట్లే ఇప్పడు సింగరేణిని కూడ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు లాభాల బాటలో ఉండే సింగరేణికి నష్టాలు రావడానికి గల కారణలపై ప్రభుత్వం శేతపత్రం విడుదల చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణిలో రోజురోజుకు పర్మినేంట్ కార్మికులను తగిస్తూ కాంట్రాక్టు కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ వెట్టి చాకిరి చేయించుకోవడం సరికాదని, కోల్ ఇండియా తరహాలో ఇక్కడ అదే వేతనాలు చెల్లించాలన్నారు. సింగరేణిలో పని చేసే కార్మికులను ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వెంటాడుతుంటాయని, ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్‌వ్యాలివేషన్ ద్వారా తమ వారసులకు ఉద్యోగ కల్పన జరిగేవని కాని ఇప్పుడు వాటిని కారుణ్య నియామకాల పేరుతో భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికలు అతి తక్కువ పెన్షన్లు అందుతుండడంతో వారికి ఆసరా పెన్షన్లు సైతం ఇవ్వాలన్నారు.
సింగరేణిలో మితిమీరినా రాజకీయ జోక్య : సీతారామయ్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణిలో మితిమీరినా రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో సింగరేణి ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొంటున్నాయని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శలు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌కుమార్‌లు ఆరోపించారు. తెలిపారు. సింగరేణిలో బీఆర్‌ఎస్ వేలు పెడితే కాంగ్రెస్ ఏకంగా కాలు పెట్టడంతో ఎప్పుడు లేనిది అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ సింగరేణికి రూ.21 కోట్లు బకాయిలు పెట్టి పోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏకంగా రూ.56 వేల కోట్లు చేరిందన్నారు. గతంలో ఏడాదికో రెండేళ్లకో ఓ కొత్త మైన్ సింగరేణికి వచ్చేదని, కాని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక మైన్ కూడ కేటాయించలేదని ఇందుకు సంబంధించియాజమన్యాం కాని ప్రభుత్వం పూర్తిగా ఉదాశీనతతో వ్యవరిస్తున్నాయన్నారు. మరోవైపు బొగ్గు వెలికి తీతలో సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం, మెడికల్ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేయడం, కార్మిక సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యలను నిరిసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటీకే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో ఇటీవలే సమావేశం నిర్వహించి యాజమన్యానికి చేసిన సూచనలు జూన్ రెండవ వారం లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మె తప్పదని వారు హెచ్చరించారు.
పెట్రో ధరలపై పెద్ద ఎత్తున నిరసనలు..
కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సాంబశివరావు తెలిపారు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నసమయం పెట్రోలు ధరలను తగ్గించని కేంద్రం ఇప్పుడు యుద్దం పేరుతో రూ. 107 పై చిలుకు ఉన్న పెట్రోల్ ధరలను కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.116కు పెంచడం దుర్మార్గమన్నారు. సంక్షోభం పేరుతో సామన్య ప్రజలపై భారం మోపడం సరికాదని, కార్పొరేట్ సంస్థలపై ప్రత్యేక పన్నులు, సంపద పన్ను పెంచి పేదలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌పై కేసులు పెట్టి మానసిక వేదింపులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. విశ్లేషణ సమయాల్లో విమర్శలు, సద్విమర్శలు చేయడం సహజమని, అందులో భాగంగానే ఎపిడిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారని, అంత మాత్రానికే నాగేశ్వర్‌పై కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం వారికే నష్టమని పేర్కొన్నారు.
విద్య, వైద్యంరంగాల్లో దోపిడిని అరికట్టాలి..
విద్య, వైద్యరంగంలో ఫీజుల దోపిడిని అరికట్టాలని ప్రభుత్వాన్ని సాంబశివరావు డిమాండ్ చేశారు. జూన్ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో కొనసాగుతున్న ఫీజుల దోపిడిని ప్రభుత్వం నియంత్రించాలన్నారు. అదేవిధంగా వైద్యం పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా ఫీజులను వసూళ్లు చేస్తున్నాయని వాటిని అరికట్టాలన్నారు. డ్రగ్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పులు కనిపించకపోగా, మరింత ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో నిఘాను మరింత పటిష్టం చేయాలని సూచించారు. గ్రామ పంచాయితీ కార్మికులకు మొదటి తారీకున వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అదే సమయంలో కార్మికులకు ఇటీవల పెంచిన కనీసం వేతనం ఏమాత్రం సరిపోదని, న్యాయబద్దంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.అదేవిధంగా ఆశా, అంగన్‌వాడీ కార్మికులకు సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.






