- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తేవాలి: సీపీఐ కూనంనేని డిమాండ్
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పని వేళలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పని వేళలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగుల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పేరుకు వైట్ కలర్ ఉద్యోగులైనప్పటికీ విపరీతమైన పనిగంటలతో పాటు, మానసిక ఒత్తిడికి ఇబ్బందులు పడుతున్నారని, చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులకు గురైతున్నారని వారు పేర్కొన్నారు.
వారి ఉద్యోగాలకు రక్షణ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగాలు తీసివేయడం, రాజీనామా చేస్తే డబ్బులు చెల్లించాలనే అగ్రిమెంట్లు రాయించుకోవడం పట్ల జస్టీస్ నాగేష్ భీమపాక ధర్మాసనం వ్యాఖ్యలు ఆహ్వానించ తగినవని వారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పని పని గంటలకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.






