- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌తో చర్చలు సక్సెస్.. సీపీఐకి కొత్తగూడెం మేయర్ పదవి
కొత్తగూడెం మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మేయర్ పదవిని సీపీఐ పార్టీకి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగూడెం మేయర్(Kothagudem Mayor) పీఠంపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మేయర్ పదవిని సీపీఐ పార్టీకి ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్‌కు డిప్యూటీ మేయర్ పదవి ఖరారు అయింది.
మొదటి రెండున్నరేళ్లు సీపీఐ అభ్యర్థి మేయర్‌గా ఉంటే.. కాంగ్రెస్ అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా ఉండనున్నారు. తర్వాతి రెండున్నరేళ్లు కాంగ్రెస్ అభ్యర్థి మేయర్‌గా ఉంటే.. సీపీఐ అభ్యర్థి డిప్యూటీ మేయర్‌గా ఉండనున్నారు. ఇలా కాంగ్రెస్, సీపీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ పార్టీ ఘన విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని అత్యధిక వార్డుల్లో విజయం సాధించింది. అయితే మెజార్టీకి అవసరమైన స్థానాలు రాకపోవడంతో.. సీపీఐకి ఇతర పార్టీల మద్దతు అవసరం అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్ నిర్ణయం కోసం సీపీఐ నేతలు ఎదురుచూశారు. చివరకు కాంగ్రెస్ నుంచి సానుకూల ప్రతిపాదన కావడంతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో ఆ పార్టీ వర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.






