నేడు ‘సీపీగెట్’ ఫలితాలు.!

by Geesa Chandu |

రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) ఫ‌లితాలను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు.

నేడు ‘సీపీగెట్’ ఫలితాలు.!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీపీగెట్‌) ఫ‌లితాలను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. ఉన్నత విద్యామండ‌లి కార్యాలయంలో చైర్మన్ లింబాద్రి ఫలితాలను ప్రకటించనున్నారు. శుక్రవారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి స్పష్టంచేశారు. సీపీగెట్ పరీక్షను జూలై 6 నుంచి 16వ తేదీ వరకు ఆన్ లైన్ పద్ధతిన నిర్వహించారు. రోజుకు మూడు షిఫ్టుల్లో మొత్తం 41 పీజీ కోర్సులు; నాలుగు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు కూడా ఈ రాత‌ ప‌రీక్షలు నిర్వహించారు. మొత్తం ఈ 45 కోర్సుల‌కు 73,342 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 64,765 మంది ఎగ్జామ్ కు హాజరయ్యారు.

Next Story