సీపీగెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు షెడ్యూల్

by GSrikanth |

సీపీగెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. క్వాలిఫై అయిన విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈనెల 12వ తేదీ వరకు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

సీపీగెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు షెడ్యూల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీపీగెట్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్లకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. క్వాలిఫై అయిన విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈనెల 12వ తేదీ వరకు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈనెల 13న తప్పొప్పుల సవరణకు అవకాశం కల్పించారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల మార్పులు, చేర్పులకు ఈనెల 17న ఛాన్స్ ఇచ్చారు. 23వ తేదీన సెకండ్ ఫేజ్ అలాట్ మెంట్‌ను డిస్ ప్లే చేస్తారని కన్వీనర్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విద్యార్థులు స్వయంగా వెళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Next Story