బిగ్ బ్రేకింగ్‌న్యూస్.. ప్రె‌స్‌మీట్‌లో సంచలన విషయాలు చెప్పిన సీపీ రంగనాథ్

by Malleboina Mahesh |   (  Updated:2023-04-05 13:25:09  IST  )

పదో తరగతి ప్రశ్నపత్తం లీకేజీలో వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ ద్వారా సంచలన విషయాలు వెల్లడించారు.

బిగ్ బ్రేకింగ్‌న్యూస్.. ప్రె‌స్‌మీట్‌లో సంచలన విషయాలు చెప్పిన సీపీ రంగనాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: పదో తరగతి ప్రశ్నపత్తం లీకేజీలో వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ ద్వారా సంచలన విషయాలు వెల్లడించారు. ఈ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను ఎ1 గా, బూర ప్రశాంత్ ను ఎ2గా చేర్చారు. కాగా కమలాపూర్ పాఠశాల నుంచి పెపర్ బయటకు వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులపై ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. ఏ2 ప్రశాంత్ ఎమ్మెల్యే ఈటలకు కూడా 10: 41కి ప్రశ్నపత్రం పంపించాడు. అలాగే ప్రశ్నపత్రం పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడినట్లు సీపీ తెలిపారు.

ఈ సంఘటనకు ముందు రోజే బండి సంజాయ్, బూర ప్రశాంత్ వాట్సాప్ లో చాటింగ్ చేసుకున్నారు. ఈ చాటింగ్ ఆదరంగానే బండి సంజయ్‌ను ఈ కేసులో ఏ1గా చేర్చడం జరిగింది. అలాగే ఈ రోజు విచారణలో బండి సంజయ్ నేరాన్ని అంగికరించారని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఇలా చేసినట్లు సీపీ స్పష్టం చేశారు. అలాగే ఈ కేసులో ఎవరిని ఇరికించాలనే ఉద్దేశం మాకు లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొంతమంది కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు.

Next Story