Medaram Jatara 2026 : అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాలో జాతర మార్గం

by Bhoopathi Nagaiah |

మేడారం మహాజాతర వేళ భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా ఏర్పాటు చేసింది.

Medaram Jatara 2026 : అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాలో జాతర మార్గం
X

దిశ, మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారం మహాజాతర వేళ భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా ఏర్పాటు చేసింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి గద్దెల వరకు ప్రతి వాహనం కదలికలను కెమెరాల్లో బంధించనున్నారు. ఇందుకోసం ట్రై సిటీ పరిధిలో 715, మేడారం మార్గంలో 530 సీసీ కెమెరాలను అమర్చి, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షణాల్లో గుర్తించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తూ అధికారులకు సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు.

Next Story