గ్లోబల్‌ సమ్మిట్‌కు 6 వేల మందితో భారీ బందోబస్తు : రాచకొండ సీపీ సుధీర్‌ బాబు

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్దమైంది.

గ్లోబల్‌ సమ్మిట్‌కు 6 వేల మందితో భారీ బందోబస్తు : రాచకొండ సీపీ సుధీర్‌ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్దమైంది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పండగ వాతావరణం నెలకొంది. రేపు, ఎల్లుండి జరగబోయే ఈ సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రతినిధుల భద్రత పట్ల పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సమ్మిట్‌ జరుగనున్న ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 44 దేశాల నుంచి వస్తున్న విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథి గృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజుల గ్లోబల్‌ సమ్మిట్‌కు 6 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 14 నుంచి వేదిక వరకు బందోబస్తు ఉందని తెలిపారు. ఇప్పటికే ప్రజా వేదికను ఆధీనంలో తీసుకున్నామని తెలిపారు. సమ్మిట్‌కు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతిస్తామని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు వెల్లడించారు.

Next Story