వ్యూస్, లైక్స్, ఫేమస్ కోసం.. విలువలు మరిచిపోతే ఎలా.. సజ్జనార్ సంచలన ట్వీట్

by Malleboina Mahesh |

ఇటీవల హైదరాబాద్ నగర కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన సజ్జనార్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు.

వ్యూస్, లైక్స్, ఫేమస్ కోసం.. విలువలు మరిచిపోతే ఎలా.. సజ్జనార్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల హైదరాబాద్ నగర కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన సజ్జనార్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొదటి నుంచి సోషల్ మీడియాపై సజ్జనార్ ప్రత్యేక దృష్టి పెట్టి.. సమాజం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా యూట్యూబర్ల కంటెంట్ పై సంచలన ట్వీట్ చేశారు. వ్యూస్, లైక్స్, ఫేమస్ కోసం.. విలువలు మరిచిపోతే ఎలా అంటూ కొంత మంది పాడ్ కాస్ట్ వీడియోలను ట్యాగ్ చేసి.. నిలదీశారు. అందులో.. వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని సజ్జనార్ ప్రశ్నించారు.

పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమాజాభివృద్ధికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించవద్దని అన్నారు. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదని, క్షమార్హం.. చట్టరీత్యా నేరమని యూట్యూబర్లు గుర్తు పెట్టుకొవాలని, ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమేనని.

పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుందని, ఇకపై మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇప్పటికే అలాంటి వీడియోలు చేసిన వారు తక్షణమే వాటిని తొలగించకున్నా.. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయడంతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని నెటిజన్లకు కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు.

Next Story