- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెప్పపాటు ఆదమరుపు.. రెప్పవాల్చని విషాదం! సజ్జనార్ హెచ్చరిక
రోడ్డు భద్రత, సామాజిక అంశాలపై నిత్యం ప్రజలను చైతన్యపరిచే సీనియర్ ఐపీఎస్ అధికారి వీ.సీ. సజ్జనార్ మరోసారి వాహనదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు భద్రత, సామాజిక అంశాలపై నిత్యం ప్రజలను చైతన్యపరిచే సీనియర్ ఐపీఎస్ అధికారి వీ.సీ. సజ్జనార్ మరోసారి వాహనదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ రోడ్డు ప్రమాద వీడియో షేర్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ సమీపంలో ఎన్‌హెచ్-43పై ఇటీవల జరిగిన ఓ భయానక ప్రమాద దృశ్యాలను ఆయన పంచుకున్నారు. "రెప్పపాటు ఆదమరుపు.. రెప్పవాల్చని విషాదం!" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రతి క్షణం అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన రుజువు చేస్తోందని పేర్కొన్నారు. రోడ్డుపై వాహనదారుల చిన్న అజాగ్రత్త లేదా మితిమీరిన వేగం.. కేవలం వారి ప్రాణాలకే ముప్పు కాదు, ఎదుటివారి కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనం నడపాలని, ఇంట్లో తమ రాక కోసం ఆత్మీయులు ఎదురుచూస్తుంటారన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు.






