- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహార కల్తీ.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కల్తీ రాయుళ్లకు సీపీ సజ్జనార్ వార్నింగ్
ఆహార కల్తీ.. ఇది కేవలం నేరం కాదు, సమాజంపై సాగుతున్న ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆహార కల్తీ.. ఇది కేవలం నేరం కాదు, సమాజంపై సాగుతున్న ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. మనం ఎంతో ప్రేమతో పసిబిడ్డలకు తినిపించే బిస్కెట్లు, ఐస్ క్రీమ్‌ల నుంచి ప్రతి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల అకృత్యాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే పరమావధిగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తెస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయం అని హర్షం వ్యక్తం చేశారు.
సీఎం దృఢ సంకల్పానికి అనుగుణంగా, హైదరాబాద్ కమిషనరేట్‌లో మేము ఇప్పటికే ఏర్పాటు చేసిన H-FAST బృందం కల్తీ ముఠాల గుట్టు రట్టు చేస్తూ ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. గత నెల రోజుల్లో 61 కేసులు నమోదు చేసి, 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేయడంతో పాటు, 64 మంది నిందితులను అరెస్ట్ చేశామని వివరాలు వెల్లడించారు. లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కల్తీ లేని సమాజం కోసం, సురక్షితమైన ఆహారం కోసం మా పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.






