- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది : సీపీ సజ్జనార్
రోడ్డు ప్రమాదాల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ తరచూ సోషల్ మీడియా వేదికగా ప్రజలను హెచ్చరిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదాల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ తరచూ సోషల్ మీడియా వేదికగా ప్రజలను హెచ్చరిస్తుంటారు. తాజాగా ఓ చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయంపై ఓ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోందని తెలిపారు. నిజంగానే ఆ వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమంటుంది. ఓ చిన్నారి ఆటో పక్క నుంచి రోడ్డు మీదికి పరిగెడుతూ వచ్చింది. అదే సమయంలో ఓ బస్సు వేగంగా వచ్చింది. డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. లేదంటే ఆ బస్సు చక్రాల కింద నలిగిపోయి.. అబ్బా ఊహించడానికే చాలా దారుణంగా ఉంది. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లవెంట నడిచేటపుడు పిల్లల చేతిని ఎట్టిపరిస్థితుల్లో వదలవద్దని సజ్జనార్ సూచించారు. చిన్న నిర్లక్ష్యమే జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుందన్నారు. ఆ చిన్నారిలా అదృష్టం అందరికీ ఎప్పుడూ తోడుండదని, అప్రమత్తంగా ఉండటమే మనకు, మన చిన్నారులకు అసలైన రక్షణ అని తెలిపారు. సీపీ సజ్జనార్ షేర్ చేసిన ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అవుతుండగా.. అందరూ బస్సు గురించే మాట్లాడుతున్నారు కానీ.. రోడ్డును ఆక్యుపై చేసి పార్క్ చేసిన ఆటో గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఓ నెటిజన్ వాపోయారు. మరొకరు.. అతి గారాబం, పిల్లలను వదిలేయడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. నిజంగానే ఆ చిన్నారి మృత్యుంజయురాలు అని కామెంట్ చేశారు.






