బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌..! ప్రచారంపై స్పందించిన సీపీ సజ్జనార్

by Ramesh Naini |

బంగారంతో బీ కేర్‌ఫుల్.. తులం లక్షన్నర దాటడంతో చైన్ స్నాచింగ్‌లు, హత్యలు జరుగుతున్నాయి.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌..! ప్రచారంపై స్పందించిన సీపీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారంతో బీ కేర్‌ఫుల్.. తులం లక్షన్నర దాటడంతో చైన్ స్నాచింగ్‌లు, హత్యలు జరుగుతున్నాయి.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సజ్జనార్ హెచ్చరిక..

భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం.. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story