సౌదీ బస్సు ప్రమాదంపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. 45 మందీ హైదరాబాద్ వాసులే?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 07:37:53  IST  )

సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు.

సౌదీ బస్సు ప్రమాదంపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. 45 మందీ హైదరాబాద్ వాసులే?
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. మక్కా యాత్రకు వెళ్లిన ప్రయాణికులు చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో జరిగిన బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో హైదరాబాద్ కు చెందినవారు మరణించారని తెలిపారు.

నవంబర్ 9వ తేదీన హైదరాబాద్ నుంచి 54మంది యాత్రికులు మక్కాకు వెళ్లారని తెలిపారు. వారిలో నలుగురు మక్కాలోనే ఉండిపోగా..మరో నలుగురు కారులో మదీనాకు వెళ్లారని పేర్కొన్నారు. మిగతా 46 మంది బస్సులో మదీనాకు బయల్దేరగా.. అక్కడికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఈ ఘోరం జరిగిందన్నారు. ఈనెల 23వ తేదీ వరకూ ట్రావెల్ ప్లాన్ ఉందని, అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 45 మందీ చనిపోయారని ప్రకటించారు.

హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రయాణికుల్లో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయపడ్డారని ప్రకటించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. కాగా.. సౌదీ బస్సుప్రమాదంలో హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన రెండు కుటుంబాలు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల పేర్లు వెల్లడించడంతో.. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story