CP Sajjanar: డీసీపీ చైతన్య కాల్పులకు అసలు కారణం ఇదే: సీపీ సజ్జనార్ క్లారిటీ

by Prasad Jukanti |   (  Updated:2025-10-25 12:36:55  IST  )

చాదర్ ఘాటు కాల్పులపై సీపీ సజ్జనార్ స్పందించారు.

CP Sajjanar: డీసీపీ చైతన్య కాల్పులకు అసలు కారణం ఇదే:  సీపీ సజ్జనార్ క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ చాదర్ ఘాట్‍లో జరిగిన కాల్పుల (Chadar Ghat firing) ఘటనపై సిటీ సీపీ వి.సి సజ్జనార్ (CP Sajjanar) స్పందించారు. ఇవాళ చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ సమీపంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ పారిపోతుండగా వారిని అక్కడే తన సిబ్బందితో ఉన్న సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ చైతన్య (DCP Chaitanya) పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక దొంగ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్‍పై దాడికి ప్రయత్నించారని చెప్పారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారని ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలైనట్లు చెప్పారు. గాయపడిన దొంగను ఆసుపత్రికి తరలించామని ఈఘటనలో డీసీపీతో పాటు మిగతా పోలీసు సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ దొంగలు ఎవరు? వారి వెనుక ఉన్న ముఠా ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Read More : హైదరాబాద్‍లో మరోసారి కాల్పుల కలకలం

Next Story