- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు ఎవరికీ ఊరికే రావు : సీపీ సజ్జనార్
డబ్బులు ఎవరికీ ఊరికే రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.

దిశ, వెబ్‌డెస్క్: డబ్బులు ఎవరికీ ఊరికే రావని, పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ కోట్లాది రూపాయల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెట్టుబడులు పెడితే డబుల్, త్రిపుల్ ఇన్ కమ్ వస్తుందన్న మాయ మాటలు నమ్మి అనేకమంది ఆన్ లైన్ యాప్స్ లో డబ్బు పోగొట్టుకుంటున్నారని, అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. తెలియని ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని సూచించారు. వాటి ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్నవారు వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
READ MORE ....
సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు.. కానిస్టేబుల్ సూసైడ్‌పై స్పందించిన సజ్జనార్






