Supreme Court : వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-25 10:34:23  IST  )

టీడీపీ ఆఫీసు(TDP Office))పై దాడి(Attack) కేసులో వైఎస్సార్‌సీపీ(Ysrcp Mlcs) ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట ల‌భించింది.

Supreme Court : వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట !
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఆఫీసు(TDP Office))పై దాడి(Attack) కేసులో వైఎస్సార్‌సీపీ(Ysrcp Mlcs) ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్‌ సహా 24 మందికి సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట ల‌భించింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం వైఎస్సార్సీపీ నేత‌ల‌కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్(Pre -Bail) మంజూరు చేసింది.

విచారణకు సహకరించాలని స‌ర్వోన్నత న్యాయ‌స్థానం ఆదేశించింది. విచార‌ణ‌కు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాల‌ని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడద‌ని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాల‌ని సుప్రీం కోర్టు సూచించింది. కాగా ఈ కేసులో ప్రభుత్వ లాయర్ సిద్దార్ధ లూథ్రా ముందస్తు బెయిల్ ను వ్యతిరేకించడంపై ధర్మాసనం అసహనం వెలిబుచ్చింది. ఈ కేసుపైనే ఎందుకు స్పెషల్ అటెన్షన్ అని లూథ్రాను సుప్రీంకోర్టు ప్రశ్నించడం విశేషం. పిటిషనర్ల తరుపునా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని..ఇప్పటికే పాస్ పోర్ట్ లు సరేండర్ చేశారని..టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిన రోజున వారు అక్కడ లేరని..వారి ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని..బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 30మందికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో సుప్రీంకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

Next Story