ఇల్లీగల్ ఎఫైర్‍తో మహిళ దారుణ హత్య.. 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు

by Prasad Jukanti |

సంచలనం సృష్టించిన భరత్ నగర్ మహిళా హత్య కేసులో నిందితుడికి శిక్ష ఖరారు అయింది.

ఇల్లీగల్ ఎఫైర్‍తో  మహిళ దారుణ హత్య.. 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో 14 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా కోర్టు (Hyderabad District Court) సంచలన తీర్పు వెలువరించింది. సనత్‍నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో 2011 సంవత్సరంలో ఓ మహిళను కత్తితో దారుణంగా పొడిచి హత్య కేసులో (Bharat Nagar Murder Case) నిందితుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. ఈ ఘటనపై పోలీస్ కానిస్టేబుల్ కప్పరి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విచారణలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు విచారణలో తేలింది. మహిళను చంపింది కరణ్‌సింగ్ అలియాస్ కమ్మ సింగ్ అని విచారణలో తేలింది. ఇవాళ మూడో అదనపు డిస్ట్రిక్ట్ జడ్జి వెంకటేశ్వరరావు ఈ కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు. కాగా, బాధితురాలి కుటుంబం న్యాయం కోసం 14 ఏళ్లుగా ఎదురు చూస్తోంది.

Next Story