- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భూదాన్’ కేసులో కోర్టు కీలక స్టెప్.. అధికారులు, వ్యాపారవేత్తలకు నోటీసులు
మేళ్లచెరువులో భూదాన్ భూముల అన్యాక్రాంతం వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది.

దిశ, మేళ్లచెరువు: మేళ్లచెరువులో భూదాన్ భూముల అన్యాక్రాంతం వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. 150 ఎకరాల పేదల భూమిని సిమెంట్ కంపెనీలు అక్రమంగా ఆక్రమించాయని ఆరోపణల నేపథ్యంలో జిల్లా అదనపు రెండో కోర్టు కీలక చర్యలు తీసుకుంది. సీసీఎల్ఏ కమిషనర్ సహా మొత్తం11 మంది అధికారులకు, మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
స్థానిక న్యాయవాది కమతం నాగార్జున మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు రెవెన్యూ సర్వే నెంబర్ 1057లోని 150 ఎకరాల భూదాన్ భూమిని గత 10 ఏళ్లుగా సిమెంట్ కంపెనీలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాయని, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు వత్తాసు పలికారన్న ఆరోపణలతో నాగార్జున కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న కోర్టులో హాజరై తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే ఈ అంశం కోర్టుల దృష్టికి వెళ్లినప్పటికీ, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల చర్యలు ఆలస్యమయ్యాయి. ఇటీవల హైకోర్టు తీర్పు వెలువడడంతో ఈ వ్యవహారంలో తాజాగా కోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.






