- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా చీఫ్‌కు చట్టం వర్తించదా? రంగనాథ్‌పై మరోసారి హైకోర్టు ఆగ్రహం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఉన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ అన్నిటికి అతీతమైన వ్యక్తిని అనుకుంటున్నారని, చట్టం తనకు వర్తించదని అనుకుంటున్నట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఉన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ అన్నిటికి అతీతమైన వ్యక్తిని అనుకుంటున్నారని, చట్టం తనకు వర్తించదని అనుకుంటున్నట్లుగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జలమండలి, ఇరిగేషన్, రెవెన్యూ.. ఇలా అన్ని శాఖల అధికారులు ఎందుకు హైడ్రా చీఫ్‌ను ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించింది. మీ విభాగాల కోరలు పీకేశారా అని ప్రశ్నించింది. అదే నిజమైతే అన్ని విభాగాలు తీసేసి హైడ్రా ఒక్కటే ప్రభుత్వ సంస్థగా ఉంటుందని ప్రకటించడం మంచిదని వ్యాఖ్యానించింది. 'సంబంధం లేని ప్రైవేట్ భూముల్లో హైడ్రా చీఫ్ ఎందుకు ప్రవేశిస్తున్నారు. పదేపదే చెప్పినా ఎందుకు మార్పు రావట్లేదు.
ఈసారి హైడ్రా చీఫ్ రంగనాథ్ విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే. లేని పక్షంలో కస్టడీలోకి తీసుకోవాలని ఏజీకి చెప్తాం. కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ చేపడుతున్న చర్యలపై రంగనాథ్ వివరణాత్మకంగా క్షమాపణలు చెప్పాలి. పూర్తి అఫిడవిట్‌తో న్యాయస్థానం ఎదుట హాజరుకావాలి' అని న్యాయమూర్తి ఆదేశించారు. అఫిడవిట్‌లో భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అతిక్రమించి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని స్పష్టంగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఈనెల 27న విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఒకవేళ ఆయన హాజరుకాని పక్షంలో చిక్కులు ఎదుర్కునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.






