- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు జైలులో కఠిన నియమాలు అనుసరించాల్సి ఉంటుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య శిక్ష అనుభవించాలి. ఈ క్రమంలో ఖైదీలు సత్ప్రవర్తన అలవరుచుకుని శిక్షాకాలం అనంతరం సమాజంలో క్రమ శిక్షణ, స్వయం సాధికారత, ఆర్థిక స్వావలంబనతో ముందడుగు వేసేలా కొన్ని జైళ్లు ఖైదీలను తీర్చిదిద్దుతున్నాయి. ఇందులో భాగంగానే ఖైదీల సంక్షేమం, కుటుంబ హక్కుల పరిరక్షణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా జైళ్లలో ఖైదీల కోసం ఏకాంత గదులను అందుబాటులోకి తెచ్చింది. ములాఖత్ సమయంలో ఖైదీలను కలిసేందుకు వచ్చిన తమ భాగస్వాములతో ఈ గదుల్లో ఏకాంతంగా గడపొచ్చు. అయితే ఇది చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో మాత్రం కాదు. ఇంతకు ఇది ఏ జైలులో అనేది తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఆరు అడుగుల బుల్లెట్.. రాజకీయ ప్రత్యర్థులను మాటల తూటాలతో.. చెడుగుడు ఆడుకునే రాజకీయ వేత్త మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. అయినప్పటికీ ఓ విద్యార్థిని స్పీచ్ విని కంటతడి పెట్టుకున్నారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాత్విక అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ఇటీవల తన తండ్రి చనిపోయాడని.. తన తల్లి కష్టపడి చదివిస్తుందని తెలిపి ఏడ్చింది. ఆ మాటలు విన్న హరీశ్‌రావు విద్యార్థినిని అక్కున చేర్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా ఈ సభలో ఎవరెవరు ఉద్వేగానికి లోనయ్యారో ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.
నటి శ్రీరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టారని కూటమి నాయకులు విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లో గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీరెడ్డి పూసపాటిరేగ స్టేషన్ కు ఇవాళ రాగా పోలీసులు విచారించారు. అనంతరం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏం జరిగిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు ‘బేర్’మంటున్నాయి. గత కొంత కాలంగా భారీ ఒడిదుడుకుల నడుమ సాగుతున్న మార్కెట్లలో ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగువేస్తారో అనే భయం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేండా చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రాసిన ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంటనే బంగారం, వెండి, బిట్ కాయిన్‌లపై పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే పేదలు ధనికులుగా మారుతారని సలహా ఇచ్చారు. ఆయన ఉన్నట్టుండి ఎందుకు ఆ ప్రకటన చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






