Sarpanch elections: మూడో విడత పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

by Prasad Jukanti |

మూడో విడత ఫలితాల్లో ఆసక్తిక కర ఫలితాలు వెలువడుతున్నాయి.

Sarpanch elections: మూడో విడత పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మ.1 గంట వరకు సాగిన పొలింగ్ జరిగింది. అనంతరం భోజన విరామం తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. తొలుత వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను కౌంట్ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ను ఎన్నుకోనున్నారు. మూడో విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 287 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 42 బీఆర్ఎస్, 9 బీజేపీ, ఇతరులు 57 మంది ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మొదటి రెండు దశల్లో మెజార్టీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకున్న నేపథ్యంలో మూడో విడతలో ఎవరిది పై చేయి ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

Next Story