ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే

by Ramesh Naini |

టీజీఈఏపీసెట్ 2026 మొదటి విడత ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.

ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీఈఏపీసెట్ 2026 మొదటి విడత ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీఈఏపీసెట్ కన్వీనర్ ఎ. శ్రీదేవసేన కౌన్సెలింగ్ కు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 37 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం (జూన్ 19) నుంచి టీజీ ఎప్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొదటి విడత కౌన్సెలింగ్ కు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ కోసం నేటి నుండి ఈ నెల 28 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 4 న లేదా అంతకంటే ముందు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందని కన్వీనర్ తెలిపారు.

మొదటి విడత సీట్ల కేటాయింపు

వెబ్ ఆప్షన్ల సవరణలకు జూలై 5 నుంచి 7 వరకు అవకాశం ఉంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జులై 10 న లేదా అంతకుముందు ఉంటుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ముందుగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. మంచి కాలేజీలు, కోర్సులలో సీటు పొందేందుకు అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లను ఎంచుకోవాలని కోరారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgeapcet.nic.in ను సంప్రదించాలని సూచించారు.

Next Story