- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ పథకం.. యధాతథంగా కొనసాగింపుపై మండలి ఏకగ్రీవ తీర్మానం
కూలీలకు ఉపాధి హక్కుగా లభించే ఎంజీఎన్ఆర్ఇజీఏ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక ఆస్తుల సృష్టి, మౌలిక వసతుల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీఎన్ఆర్ఇజీఏ) 9వ రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదిస్తున్న వీబీజీ రాంజీ విధానం అమల్లోకి వస్తే కూలీలు నష్టపోయే ప్రమాదం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి హక్కుగా లభించే ఎంజీఎన్ఆర్ఇజీఏ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, డైరెక్టర్ దివ్య దేవరాజన్‌తో పాటు మండలి సభ్యులు గుమ్మడి సొమయ్య, బీరెడ్డి భగవాన్ రెడ్డి, ఎన్. ప్రతాప్ రెడ్డి, సిద్దబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, గండీడ్ నరసింహులు గౌడ్, దండు రమేష్, చల్లా నారాయణ రెడ్డి, మండరాపురం నాగేశ్వరరావు పలువురు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం అమలు విధానం, కల్పించిన పని దినాలు, చేపట్టిన పనులు, సృష్టించిన సామాజిక ఆస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల జీవనోపాధికి ఎంజీఎన్ఆర్ఇజీఏ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మండలి సభ్యులు పథకం అమలులో మెరుగుదలకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.






