- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా..? బీజేపీలో చేరబోతున్న ఆ మాజీ ఎమ్మెల్యే!
పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో చీకట్లు కమ్ముకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో చీకట్లు కమ్ముకున్నాయి. పార్టీ ముఖ్య నేతలు పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. తాజాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ షాక్ నుంచి బీఆర్ఎస్ తేరుకోక ముందే ఆ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై గులాబీ బాస్ స్పందిస్తారా.. లేక ట్రబుల్ షూటర్ హరీశ్ రంగంలోకి దిగుతారా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు నేతను బుజ్జగిస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది.
వెంటాడుతోన్న వరుస కేసులు..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టేట్‌లో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ సంక్షోభాన్ని తీవ్ర ఎదుర్కొంటోంది. ఓ వైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనగోళ్లపై విచారణ, ఫార్ములా ఈ కారు రేసు కేసుల రూపంలో సమస్యలన్నీ ఆ పార్టీని చుట్టుముట్టాయి. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ప్రకటించకపోవడంతో పార్టీ కేడర్‌లోనూ నైరాశ్యం నెలకొంది.
ముఖ్య నేతల్లో అంతర్మథనం..
కేసీఆర్ టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పలు వేదికలపై చీల్చిచెండాడుతున్నారు. కాళేశ్వరం నివేదిక, కృష్ణా, గోదావరి జలాల విషయంలో నాటి వైసీపీ సర్కార్‌తో అంటకాగి రాష్ట్రానికి రావాల్సిన జలాలను అప్పనంగా వారికి కట్టబెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. ఇదే పార్టీలో ఉంటే రాబోయే ఎన్నికల్లో గెలిచి నిలుస్తామా అన్న సందేహం వారిలో ఉత్పన్నమవుతోంది. ఫలితంగా నియోజకవర్గాల్లో రేవంత్ ఆరోపణలు తిప్పికొట్టలేక.. వారిని ఎదుర్కోలేక పార్టీ మారడం ఒక్కే శరణ్యమనే భావనకు వచ్చేశారు. మరోవైపు త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీని బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం కూడా అందుకు ఆజ్యం పోసింది.






