- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి కొనుగోళ్లపై పరిమితి ఎత్తేయండి.. సీసీఐకి మంత్రి తుమ్మల రిక్వెస్ట్
by Prasad Jukanti |
మంత్రి తుమ్మల సీసీఐతో మాట్లాడారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు నిబంధన ఎత్తివేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) సీసీఐని (CCI) కోరారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై సీసీఐ సీఎండీ లలత్ కుమార్‍తో మంత్రి తుమ్మల ఇవాళ ఫోన్‍లో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ పత్తి రైతుల ఇబ్బందులను వివరించిన తుమ్మల.. పత్తి కొనుగోళ్లలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిపై (Cotton Purchase Limit, 7 Quintal Rule) చర్చించారు. ఈ నిబంధన ఎత్తివేసి పాత విధానంలో సీసీఐ పత్తి కొనుళ్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కపాస్ కిసాన్ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంచాలని, పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనేలా చర్యలు చేపట్టాలన్నారు.
Next Story






