- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మణుగూరు బీటీపీఎస్ టెండర్లలో గోల్ మాల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో టెండర్ ప్రక్రియలో గోల్ మాల్ జరుగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

మణుగూరు బీటీపీఎస్ టెండర్లలో గోల్ మాల్
- అధికారుల కనుసన్నల్లోనే తతంగం..
- కావాల్సిన వారికి టెండర్ వచ్చేలా లోపాయికారి ఒప్పందాలు
- లోకల్ వ్యక్తులకు దక్కని కాంట్రాక్టు అవకాశం
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో టెండర్ ప్రక్రియలో గోల్ మాల్ జరుగుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బీటీపీఎస్ లో జరిగే కాంట్రాక్ట్ పనులకు సంబంధించి ఓపెన్ టెండర్లు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆన్ లైన్ లో టెండర్లను కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్దంగా జరుగుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారికే టెండర్లను వచ్చే విధంగా చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియ అధికారుల అండదండలతోనే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కాంట్రాక్టులు చేయాలనుకునే లోకల్ వారికి అవకాశం దక్కడం లేదు. ఇప్పటికైనా అధికారుల తీరులో మార్పు వస్తుందా? లేక వారికి సంబంధించిన వారికే టెండర్లు ఇస్తారో వేచి చూడాలి.






