పక్కదారి పడుతోన్న CMR ధాన్యం.. విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ అవినీతి బాగోతం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-08 02:13:54  IST  )

సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నాయి. ఇందులో భాగంగా కోట్లాది రూపాయల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

పక్కదారి పడుతోన్న CMR ధాన్యం.. విజిలెన్స్ తనిఖీల్లో బయటపడ్డ అవినీతి బాగోతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నాయి. ఇందులో భాగంగా కోట్లాది రూపాయల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో ఇదీ తేటతెల్లం అయింది. వరంగల్ యూనిట్ పరిధిలో విజిలెన్స్ సోదాలు చేపట్టగా సీఎంఆర్ ధాన్యంలో రూ.9.34 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఈ మేరకు విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ శుక్రవారం వెల్లడించారు. హన్మకొండ జిల్లా కమలాపుర్ మండల పరిధిలోని శ్రీశైలం మల్లన్న ఇండస్ట్రీస్‌లో సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా రూ. 40వేల క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటి విలువ రూ.9.34 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. కాగా, కేసు నమోదు చేసి హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అధికారులకు సిఫార్స్ చేసినట్లు తెలిపారు. నల్లగొండ యూనిట్ పరిధిలో చేపట్టిన రూట్ చెకింగ్‌లో 13 వాహనాలపై కేసు నమోదు చేసి రూ.3లక్షల జరిమానా విధించినట్లు ప్రకటించారు. అలాగే కరీంనగర్ యూనిట్ పరిధిలో రూ.70వేల విలువైన 30క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకుని కేసు బుక్ చేసినట్లు డీజీ శిఖా గోయల్ పేర్కొన్నారు.

Next Story