- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ACB: ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు.. నెల రోజుల్లో 23 మంది లంచావతారులు!
లంచం సొమ్ముకు కక్కుర్తి పడి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: లంచం సొమ్ముకు కక్కుర్తి పడి కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు (ACB) ఏసీబీకి విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరి నెలలోనే 17 కేసులు నమోదు అయినట్లు (Anti-Corruption Bureau, Telangana) తెలంగాణ అవినీతి నిరోధక శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 15 ట్రాప్ కేసులు కాగా, 2 అసమాన ఆస్తుల కేసులని తెలిపింది. ఇందులో భాగంగా 2 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులతో సహా ఇరవై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఏసీబీ వెల్లడించింది.
బీసీ సంక్షేమం, ఇంధనం, గృహ, అటవీ, వ్యవసాయం & సహకారం, విద్య, సాంఘిక సంక్షేమం, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, రవాణా,రోడ్లు, భవనాలు వంటి వివిధ శాఖల ట్రాప్ కేసులలో రూ.7,60,000 మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. రెండు అసమాన ఆస్తుల కేసుల్లో రూ.4,13,78,767 విలువైన ఆస్తులను కనుగొన్నట్లు పేర్కొంది. కాగా, ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని ఏసీబీ సూచించింది.






