- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేయర్ మేకల కావ్యకి పదవి గండం.. మరోసారి సరిహద్దు దాటిన కార్పొరేటర్లు
by GSrikanth |
జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు మరోసారి కార్యాచరణ సిద్ధం చేస్తుకున్నట్లు సమాచారం.

X
దిశ, జవహర్ నగర్: జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు మరోసారి కార్యాచరణ సిద్ధం చేస్తుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో ఆంధ్రా సరిహద్దు దాటారని తెలుస్తోంది. గత మూడేళ్ల క్రితంమే మేయర్ కావ్యతో పాటు తన తండ్రి మేకల అయ్యప్ప ఆధిపత్యానికి వ్యతిరేకంగా బాపట్ల క్యాంపునకు వెళ్ళారు. ఏడాది గడిచినా వారిలో ఎలాంటి మార్పు లేదని, నిధుల కేటాయంపులోనూ ఇంటర్నల్ వార్ చెయ్యాల్సి వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో మేయర్ మేకల కావ్యకి పదవి గండం ముంచుకొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత నాలుగు రోజులుగా కార్పొరేటర్లను బుజ్జగించే పనిలో నిమగ్నమై మేయర్ తన పదవి పోకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
Next Story






