- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponguleti Srinivas Reddy: ఇకపై కార్పొరేట్ లెవల్ లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు: పొంగులేటి
by Prasad Jukanti |
దశల వారీగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్ వ్యవస్థీకరించబోతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar Offices) ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు. దశల వారీగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ చేపడతామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లతో మంత్రి సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలను గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చాలా వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని, అలాంటి వాటికి త్వరలోనే సొంత భవనాలు నిరిస్తామన్నారు. వాటి కోసం భూములు గుర్తించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు.
Next Story






