Covid-19: మళ్లీ కరోనా వార్డులు వచ్చేశాయ్.. గాంధీలో కోవిడ్-19 వార్డు ఏర్పాటు.. దాదాపు 78 బెడ్స్ అంటా!

by Ramesh Naini |

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.

Covid-19: మళ్లీ కరోనా వార్డులు వచ్చేశాయ్.. గాంధీలో కోవిడ్-19 వార్డు ఏర్పాటు.. దాదాపు 78 బెడ్స్ అంటా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న (Corona virus) కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దేశం కరోనా ఎంటరైనట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో తెలంగాణలో కూడా కోవిడ్-19 (Covid-19) కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ (Telangana Medical and Health Department) అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ పరీక్షలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గాంధీ, ఫీవర్‌, ఉస్మానియా వంటి ఆస్పత్రుల్లో ఇప్పటికే రాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

(Covid-19 ward set up) తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్లో కోవిడ్-19 వార్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు గాంధీలో దాదాపు 78 బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో కూడా కొవిడ్‌ వార్డును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఫీవర్‌, చెస్ట్‌, నిలోఫర్‌, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక నేడు, రేపో ప్రజలకు కోవిడ్‌పై ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పల్మనాలజిస్టు (శ్వాసకోశ వ్యాధుల వైద్యుడు)కి కరోనా పాజిటివ్‌ మొదటి కేసు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా లక్షణాలు కనిపించినట్లైతే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులను, ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

Next Story