- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T BJP: 'ఈ బలవంతపు హిందీ రుద్దుడే వద్దు' బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై నెటిజన్ల విమర్శలు
హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల వేళ బీజేపీ పార్టీపై హిందీ భాష విమర్శలు ఎదురవుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇటీవల హిందీ భాష (Hindi language) వివాదం భగ్గుమంటోంది. తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతున్నారంటూ నాన్ హిందీ స్టేట్స్ లో పొలిటికల్ దుమారం నడుస్తోంది. తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా దక్షిణాదిరాష్ట్రాల తమపై బలవంతంగా హిందీని రుద్ధవద్దంటూ నేతలు తమ గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నిక (Hyderabad local bodies election) అభ్యర్థిని ప్రకటించే క్రమంలో బీజేపీ (BJP) విడుదల చేసిన ప్రెస్ నోట్ పై వివాదం రాజుకుంది. ఈ ప్రెస్ నోట్ లో నియోజకవర్గం, అభ్యర్థి పేరు మాత్రమే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇచ్చి మిగతా నోట్ అంతా కేవలం హిందీ భాషలోనే విడుదల చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దుడు అంటే ఇదే. తెలంగాణలో అధికార భాషలో ఒకటైన ఉర్ధూలో ఎలాగూ ఇవ్వరు. జనాలకు అర్థమయ్యే తెలుగు, ఇంగ్లీష్ కూాడా వదిలేసి హిందీలో మాత్రమే ఎందుకు ఇచ్చినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. కాగా తమ ప్రభుత్వం భారతదేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాజకీయాల లక్ష్యాల కోసమే కొంత మంది హిందీని వ్యతిరేకిస్తున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఇటీవల తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి అనౌన్స్ నోట్ విషయంలో హిందీ వివాదంపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.






