మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ హాజరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-27 06:27:22  IST  )

ఇటీవల తన సినిమా ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ (Shivaji) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ హాజరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తన సినిమా ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై హీరో శివాజీ (Shivaji) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ (Telangana Women Commission) ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన ‘బుద్ధ భవన్’లోని మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కమిషన్ సభ్యులు ఆయనను విచారించనున్నారు.

కాగా, ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు చీరలు కట్టుకోవాలని, సగం సగం బట్టలు వేసుకుంటే ‘సామాన్లు’ కనిపిస్తాయని, అలాంటి వారిని ‘దరిద్రపు ము**డా’ అని మనసులో తిట్టుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో సింగర్ చిన్మయి శ్రీపాద, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్, లక్ష్మీ మంచు, రామ్ గోపాల్ వర్మ వంటి పలువురు సెలబ్రిటీలు శివాజీపై తీవ్రంగా విమర్శలు చేశారు. టాలీవుడ్ మహిళా కమిటీ ‘మా’కు ఫిర్యాదు చేయగా, విషయం తెలంగాణ మహిళా కమిషన్ వద్దకు చేరడంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు. అనంతరం చేసిన వ్యాఖ్యలపై హీరో శివాజీ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ ఆయన కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Related News : ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టండి.. శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్

Next Story