- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో కొట్టండి.. శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్
మహిళల వస్త్రాదరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మహిళల వస్త్రాదరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని కానీ మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఉన్న మన సొసైటీ ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఆడపిల్లల గురించి మాట్లాడటానికి మీకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. కొందరు మహిళలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారని అది వాళ్ల మనసులో నుండి వచ్చింది కాదన్నారు. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుందని వాళ్లు ఎలాగైనా ఉండొచ్చన్నారు. ఆడపిల్ల కాబట్టి ఇలానే ఉండాలని అనుకోవడం తప్పన్నారు.
ఒకప్పుడు తాను కూడా ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలని అనుకునేవాడినని కానీ దాని నుండి బయటకు వచ్చానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు వాళ్ల వస్త్రదారణ వల్ల కాకుండా మగావారి రాక్షసత్వం వల్లనే జరుగుతున్నాయని చెప్పారు. మగవాడితో సమానంగా బతికే హక్కు మహిళలకు లేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలు ఆడపిల్లను రక్షించే స్థితిలో లేవని విమర్శించారు. సెలబ్రెటీలు అయినా ఎవరు అయినా మీకు నచ్చినట్టు ఉండాలని కానీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చాలా మంది మగవాళ్లలో పశువుల్లా ప్రవర్తించే మనస్తత్వం ఉందన్నారు.
అజంతా శిల్పాలు ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. ఆడపిల్లల బట్టలు కల్చర్ బట్టి మారతాయని చెప్పారు. సమాజం మారిపోతుందని ఏఐ లోకి వచ్చినా మగవాళ్ల మనస్తత్వం మారాలని అన్నారు. తాను మాట్లాడితే తనను కూడా విమర్శిస్తారని అయినా తను చెప్పాలని అనుకున్నది చెబుతానని అన్నారు. వీలైతే ఆడవాళ్లు తమను తాము రక్షించుకోవాలని సలహా ఇవ్వాలన్నారు. ఆడపిల్ల ఇలాగే ఉండాలని చెప్పడం పెద్ద క్రైమ్ అని మండిపడ్డారు. మగవాళ్లు మీ వస్త్రాధరణ గురించి మాట్లాడితే బయటకు వచ్చి ఖండించాలని మండిపడ్డారు. మగవాళ్లు మాట్లాడే అహంకారపూరిత మాటలకు సపోర్ట్ చేసే ఆడవాళ్లు కూడా మారాలని అన్నారు. నష్టపోయినవారికి మద్దతు తెలపాలని ఎవరైనా ఏమైనా అంటే వాళ్లను చెప్పుతో కొడుతూ శిక్షించాలన్నారు.
Related News : మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. మహిళా కమిషన్ ఎదుట నటుడు శివాజీ హాజరు






