- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీ రాముడు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు షాక్ తగిలింది. మే 5న రాహుల్ గాంధీ పాల్గోన ఆదిలాబాద్ సభలో శ్రీ రాముడు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పీఎస్‌లో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఆదిలాబాద్ సభలో అద్దంకి మాట్లాడుతూ.. నేడు తెలంగాణలో బీజేపీ, ఇతరులు హిందువులం రాముని వారసులు అని అంటున్నారు. మీరు ఏ విధంగా రాముని వారసులు అవుతారు. రాముడు మీ చిన్నాయన, సీత మీ చిన్నమ్మన అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను కవాలనే వక్రీకరించారని అద్దంకి దయాకర్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- addanki dayakar